- సమాజంలో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధులకు, మరణాలకు కాలుష్యమే ప్రధాన కారణం. ప్రధాన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మన దేశంలో ఏటా డిసెంబరు 2న ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా (National Pollution Control Day) నిర్వహిస్తారు. పర్యావరణానికి నష్టం కలిగించే తీవ్రమైన కాలుష్య కారకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పారిశ్రామిక విపత్తుల నివారణకు అనుసరించాల్సిన చర్యల అవసరాన్ని చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- 1984 డిసెంబరు 2, 3 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారంలోని ట్యాంకు నుంచి 40-45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) వాయువు లీకైంది. పరిశ్రమ చుట్టూ 40 కి.మీ. ప్రాంతంలోని జీవులు దీని ప్రభావానికి లోనయ్యారు. తొలి 3 రోజుల్లో దాదాపు 10 వేలమంది మృత్యువాతపడగా.. మొత్తంగా పాతిక వేలమంది మరణించినట్లు అంచనా. గాయపడ్డవారి సంఖ్య దాదాపు 6 లక్షలు. ఆ సంఖ్య నాటి మొత్తం నగర జనాభాలో మూడింట రెండొంతులు. ప్రపంచ పారిశ్రామికరంగ చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భోపాల్ గ్యాస్ దుర్ఘటనను పేర్కొంటారు.
* ఈ ప్రమాదం కారణంగా ప్రభావితులైన ప్రజలను స్మరించుకునే ఉద్దేశంతో మన దేశంలో ఏటా నవంబరు 2న ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా జరుపుతున్నారు. కాలుష్యం, పారిశ్రామిక భద్రత గురించి అవగాహన కలిపంచడం ఈ రోజు లక్ష్యం.