ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025, జనవరి 28న ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలను దేహ్రాదూన్ (ఉత్తరాఖండ్)లో ప్రారంభించారు.
ఫిబ్రవరి 14 వరకు జరిగే పోటీల్లో 32 క్రీడాంశాల్లో సుమారు 10,000 మంది క్రీడాకారులు బరిలో దిగుతున్నారు.
సుమారు 450 చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం క్రీడాకారులు పోటీపడనున్నారు.
ఈ క్రీడలకు ఉత్తరాఖండ్‌లోని ఏడు నగరాలు వేదికలుగా నిలుస్తున్నాయి.