జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ మెండా దేవానంద్‌కుమార్ ఎంపికయ్యారు.
2025, ఆగస్టు 26న కేంద్రం ఈ ప్రకటన చేసింది.
గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 5న దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.
2021 నుంచి మైలవరం కళాశాలలో పనిచేస్తున్న ఆయన వినూత్న కార్యక్రమాలకు పేరొందారు.
2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.