గత పదేళ్ల(2014-24)లో వ్యవసాయానికి వినియోగించిన కరెంటు వార్షిక సగటు వృద్ధి రేటు 4.68 శాతమని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘భారత ఇంధన గణాంకాలు-2025’ నివేదికలో స్పష్టం చేసింది.
పరిశ్రమలకు 4.93, ఇళ్లకు 6.24, వాణిజ్య కనెక్షన్లకు 5.32, రైల్వేలకు 8.24, ఇతర వర్గాలకు 9.33 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదైందని తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో దేశ మొత్తం మీద వినియోగించిన 15.43 లక్షల గిగావాట్ల యూనిట్ల కరెంటులో ప్రధానంగా.. వ్యవసాయానికి 16.53 శాతం, పరిశ్రమలకు 41.80, ఇళ్లకు 24.30 శాతం వినియోగించినట్లు నివేదిక వివరించింది.
మిగతాది ఇతర అవసరాలకు వినియోగించినట్లు వెల్లడించింది. 2014-15లో దేశంలో వ్యవసాయానికి వాడిన కరెంటు లక్షా 68 వేల గిగావాట్లు కాగా 2023-24లో 2.55 లక్షల గిగావాట్లకు చేరిందని తెలిపింది.