ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాలుగు పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బొమ్మసముద్రం ఎంపికైంది.
తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి, పరిశుభ్రత-పచ్చదనంలో అదే జిల్లా అనకాపల్లి గ్రామీణ మండలంలోని తగరంపూడి, సామాజిక న్యాయం, భద్రత విభాగంలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీ జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద అవార్డుకు ఎంపికైన ఒక్కో పంచాయతీకి కేంద్రప్రభుత్వం రూ.కోటి చొప్పున అందజేస్తుంది.