Published on Dec 26, 2024
Current Affairs
జీడీపీ వృద్ధి 6.5%
జీడీపీ వృద్ధి 6.5%

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25), వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఈవై ఎకానమీ వాచ్‌ 2024 డిసెంబరు నివేదిక అంచనా వేసింది.

ప్రైవేట్‌ వినియోగ వ్యయం, స్థూల స్థిర మూలధన నిర్మాణం ఊహించిన దాని కంటే తక్కువగా పెరగడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు 7 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి అయిన 5.4 శాతానికి పరిమితమైందని తెలిపింది. 

ఏప్రిల్‌-జూన్‌లో వృద్ధిరేటు 6.7 శాతంగా నమోదైంది.