2024-25లో, 2025-26లో 6.5 శాతం మేర వాస్తవ జీడీపీ వృద్ధిని భారత్ నమోదు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తెలిపింది.
దీని ద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరుగుతుండడం, ఆర్థిక స్థిరత్వం ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కారణంగా అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టేందుకు భారత్‌కు అవకాశం ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్య సాధనకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని వివరించింది.