ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది.
ఇంతకు ముందు వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని ఏడీబీ అంచనా వేయగా, ప్రస్తుతం కోత విధించింది.
ప్రైవేట్ పెట్టుబడులు, ఇళ్ల గిరాకీ అంచనా కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) వృద్ధి అంచనాలను కూడా 7.2% నుంచి 7 శాతానికి సంస్థ సవరించింది.
2024లో ఆసియా, పసిఫిక్ దేశాల వృద్ధి 4.9% ఉండొచ్చని ఏడీబీ అంచనా వేసింది. 2024, సెప్టెంబరు అంచనాలో ఇది 5 శాతంగా ఉంది.