Published on Oct 1, 2024
Apprenticeship
జూట్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ ట్రైనీలు
జూట్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ ట్రైనీలు

పశ్చిమబెంగాల్ రాష్ట్రం, కోల్‌కతాలోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జేసీఐ) ఏడాది (2024-25) అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 20

వివరాలు:

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు రూ.7,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 21-10-2024.

Website:https://www.jutecorp.in/