2030 నాటికి సేవల రంగం ఎగుమతులు 618 బిలియన్ డాలర్ల (సుమారు రూ.52 లక్షల కోట్ల)కు చేరనున్నాయని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది.
అప్పటికి వస్తువుల ఎగుమతుల విలువ 613.04 బిలియన్ డాలర్లు (సుమారు రూ.51.50 లక్షల కోట్లు)గా ఉండొచ్చని తెలిపింది.
2018-19 నుంచి 2023-24 వరకు దేశ వస్తువుల ఎగుమతులు 5.8% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేయగా సేవల ఎగుమతులు 10.5% వృద్ధితో ముందున్నాయి.
ఇదే వేగం కొనసాగితే 2030 నాటికి సేవల ఎగుమతులు 618.21 బి. డాలర్లకు, వస్తువుల ఎగుమతులు 613.04 బి. డాలర్లకు చేరతాయి.