Published on May 17, 2025
Walkins
జోగులాంబ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు
జోగులాంబ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు

జోగులాంబ గద్వాల్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్, ట్యూటర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 34

వివరాలు:

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, అనస్థీషియా, ఎస్‌పీఎం, డీవీఎల్‌, ఫారెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఓబీజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, రేడియో డయాగ్నోసిస్‌.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 10

2. సీనియర్‌ రెసిడెంట్‌: 19

3. ట్యూటర్‌: 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, ఎంఎస్‌/ఎండీ, ఎంసీహెచ్‌, డీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మార్చి 31వ తేదీ నాటికి 45 - 65 ఏళ్లు లోపు ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,25,000, సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్‌కు రూ.55,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 28.

వేదిక: ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, జోగులాంబ గద్వాల్‌.

Website: https://gadwal.telangana.gov.in/recruitments/