ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అల్లా రఖా ఖురేషి (73) 2024, డిసెంబరు 16న అమెరికాలో కన్నుమూశారు.
విఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా కుమారుడే జాకిర్ హుస్సేన్. ఆయన 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు.
2024, నవంబరు 26న చివరిసారిగా జాకిర్ పారిస్‌లో ప్రదర్శన ఇచ్చారు.
ఆయన మూడేళ్లకే తబలా అభ్యసన మొదలుపెట్టి ఏడేళ్ల వయసులో తొలి ప్రదర్శననిచ్చి 12 ఏళ్ల నుంచి అంతర్జాతీయ పర్యటనలు ప్రారంభించారు.
జాకిర్ 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.