Published on Feb 5, 2025
Admissions
జీఏటీ-బీ 2025
జీఏటీ-బీ 2025

పోస్టు గ్రాడ్యుయేట్‌ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ పీజీలో ప్రవేశాలు పొందవచ్చు. జీఏటీ-బీ 2025ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ(జీఏటీ-బీ) 2025

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష వ్యవధి: 180 (3 గంటలు) నిమిషాల సమయం.

దరఖాస్తు రుసుము: రూ.1300; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.650.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 03-03-2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 05-03-2025 నుంచి 06-03-2025 వరకు.

పరీక్ష తేదీ: 20-04-2025.

Website:https://exams.nta.ac.in/DBT/

Online Application:https://dbt2025.ntaonline.in/