గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో దేశంలో పెద్ద రాష్ట్రాలన్నింటిల్లో రూ.3.87 లక్షలతో తెలంగాణ టాప్ ర్యాంకులో నిలిచినట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. తర్వాత వరుసగా కర్ణాటక రూ.3.80 లక్షలు, తమిళనాడు రూ.3.61లక్షలు, మహారాష్ట్ర రూ.3.09 లక్షలతో 2, 3, 4 ర్యాంకుల్లో నిలిచాయి.
కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కలిపి చూస్తే దిల్లీ రూ.4.93 లక్షల జీఎస్‌డీపీతో ముందుంది. ఏపీ తలసరి జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలు. తలసరి జీఎస్‌డీపీనే వార్షిక తలసరి ఆదాయంగా కూడా వ్యవహరిస్తారు. పలు రంగాల్లో తెలంగాణలో స్థూల జాతీయోత్పత్తి గతేడాది అధికంగా ఉన్నందున దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులో నిలిచిందని ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల నివేదిక-2024-25లో ప్రకటించింది.