వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)లో ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల ఉండగా.. ఇకపై 5%, 18% మాత్రమే కొనసాగనున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2025, సెప్టెంబరు 3న జరిగిన జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇక ఉండవు.
గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు సెప్టెంబరు 22 నుంచే అమల్లోకి రానున్నాయి.
ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు-సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించారు.
దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటిపై పన్ను తగ్గింది.