2025, మార్చిలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి. 2024 మార్చి వసూళ్లయిన రూ.1.78 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 9.9% అధికం.
జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక ఒక నెలకు సంబంధించి రెండో అత్యధిక వసూళ్లు ఈ మార్చిలోనే నమోదయ్యాయి.
2024, ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటివరకు అత్యధిక వసూళ్లుగా ఉన్నాయి. 2024-25 మొత్తంమీద రూ.22.08 లక్షల కోట్లు వసూలయ్యాయి.