2024, అక్టోబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023, అక్టోబరులో వసూలైన రూ.1.72 లక్షల కోట్లతో పోలిస్తే ఈమొత్తం 9% అధికం. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక, 2024 ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు అత్యధికంగా ఉండగా, 2024 అక్టోబరు వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు రెండో స్థానంలో నిలిచాయి.
* 2024, అక్టోబరులో వసూలైన రూ.1,87,346 కోట్ల జీఎస్‌టీలో సీజీఎస్‌టీ రూ.33,281 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.41,864 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.99,111 కోట్లు, సెస్సు రూ.12,550 కోట్లుగా ఉన్నాయి.