2024, నవంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023, నవంబరులో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 8.5% అధికం.
దేశీయ లావాదేవీల నుంచి అధిక ఆదాయాలు రావడం కలిసొచ్చింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక, 2024 ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు అత్యధికంగా ఉండగా, అక్టోబరు వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు రెండో స్థానంలో నిలిచాయి.
2024 నవంబరులో వసూలైన రూ.1.82 లక్షల కోట్ల జీఎస్‌టీలో సీజీఎస్‌టీ రూ.34,141 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.43,047 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.91,828 కోట్లు, సెస్సు రూ.13,253 కోట్లుగా ఉన్నాయి.