Published on Jan 2, 2026
Current Affairs
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు
  • దేశీయంగా 2025 డిసెంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబరు వసూళ్లయిన రూ.1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. దేశీయ విక్రయాల నుంచి వచ్చిన పన్ను ఆదాయ వృద్ధిలో మందగమనం, పన్ను కోతల వల్ల వృద్ధి తక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల నుంచి స్థూల ఆదాయం 1.2% పెరిగి రూ.1.22 లక్షల కోట్లకు చేరింది.
  • దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి ఆదాయం 19.7% వృద్ధితో రూ.51,977 కోట్లకు చేరుకుంది. డిసెంబరులో రిఫండ్‌లు 31% పెరిగి రూ.28,980 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేశాక.. నికర జీఎస్‌టీ వసూళ్లు 2.2% వార్షిక వృద్ధితో రూ.1.45 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి.