2025, ఏప్రిల్‌లో జీఎస్‌టీ స్థూల వసూళ్లు జీవనకాల గరిష్ఠమైన రూ.2.37 లక్షల కోట్లకు చేరాయి. 2024 ఏప్రిల్ వసూళ్లయిన రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.6% అధికం. జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక.. ఒక నెలకు సంబంధించి అత్యధిక వసూళ్లు ఏప్రిల్ నెలలోనే నమోదయ్యాయి. 2025 మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.
2025, ఏప్రిల్‌లో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్‌టీ ఆదాయం 10.7% పెరిగి రూ.1.9 లక్షల కోట్లుగా నమోదైంది. వస్తువుల ఎగుమతుల ద్వారా ఆదాయం 20.8% అధికమై రూ.46,913 కోట్లకు చేరింది. స్థూలంగా వసూలైన రూ.1.9 లక్షల కోట్లలో కేంద్ర జీఎస్‌టీ రూ.48,634 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.59,372 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ రూ.69,504 కోట్లుగా నమోదైంది. సెస్సు రూపేణా రూ.12,293 కోట్లు వచ్చాయి. మొత్తం రిఫండ్‌లు 48.3% పెరిగి రూ.27,341 కోట్లకు చేరాయి.