జీఎస్‌టీ ఆదాయ విశ్లేషణపై ఏర్పాటైన మంత్రుల బృందాన్ని (జీఓఎం) జీఎస్‌టీ మండలి పునర్‌వ్యవస్థీకరించింది. జీఎస్‌టీ వసూళ్లకు సంబంధించి విధానపరమైన జోక్యం అవసరమైనప్పుడు జీఓఎం సూచనలు చేస్తుంది.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ఈ మంత్రుల బృందంలో మొత్తం 9 మంది సభ్యులు- మల్లు భట్టి విక్రమార్క (తెలంగాణ), పయ్యావుల కేశవ్ (ఆంధ్రప్రదేశ్), సామ్రాట్ చౌధరీ (బిహార్), ఓపీ చౌధరీ (ఛత్తీస్‌గఢ్), కనుభాయ్ దేశాయ్ (గుజరాత్), అజిత్ పవార్ (మహారాష్ట్ర), హర్పాల్ సింగ్ చీమా (పంజాబ్), థంగం తెన్నెరసు (తమిళనాడు) ఉండనున్నారు. రాష్ట్రాల వారీగా జీఎస్‌టీ వసూళ్లు, రాబడి తీరును ఈ జీఓఎం గుర్తిస్తుంది.