Published on Feb 4, 2025
Current Affairs
జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక ఛైర్‌గా గోపాల్‌ విత్తల్‌
జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక ఛైర్‌గా గోపాల్‌ విత్తల్‌

జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక (యాక్టింగ్‌) ఛైర్‌గా భారతీ ఎయిర్‌టెల్‌ వైస్‌ఛైర్మన్, ఎండీ గోపాల్‌ విత్తల్‌ నియమితులయ్యారు.

ఇప్పటికే ఈయన ఈ బోర్డుకు డిప్యూటీ ఛైర్‌గా ఉన్నారు. టెలిఫోర్నికా ఛైర్మన్, సీఈఓ జోస్‌ మరియా అల్వారెస్‌ పలేట్‌ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.  

అంతర్జాతీయ టెలికాం పరిశ్రమలోని 1000కి పైగా కంపెనీలకు గ్లోబల్‌ సిస్టమ్‌ ఫర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ అసోసియేషన్‌ (జీఎస్‌ఎంఏ) ప్రాతినిధ్యం వహిస్తోంది.