Published on Feb 24, 2025
Current Affairs
జీఎఫ్‌ఎస్‌టీ సర్వే
జీఎఫ్‌ఎస్‌టీ సర్వే

గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ సస్టేనబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో ‘ఆక్వా కల్చర్‌ ఇన్నోవేషన్‌ టెక్‌ 2.0’ సదస్సు సందర్భంగా జనవరి 5 నుంచి 23 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగంపై సర్వే నిర్వహించారు.

అందులోని అంశాలను 22 ఫిబ్రవరి 2025న వెల్లడించారు.

అందులోని ముఖ్యాంశాలు:

రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఆక్వా సాగు చేస్తుండగా అందులో 5 ఎకరాల్లోపు చెరువులు ఉన్న రైతులే 59 శాతానికిపైగా ఉన్నారు.

కానీ, విస్తీర్ణపరంగా చూస్తే వీరు సాగు చేసేది 17.76% మాత్రమే. మొత్తం 59,879 మంది 4.44 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.

అయిదెకరాల్లోపు 35,527 మంది ఉండగా వారు సాగు చేసే విస్తీర్ణం 78,889 ఎకరాలుగా ఉంది.