Published on Mar 12, 2025
Current Affairs
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ 2025-26 విద్యాసంవత్సరానికి కింది పీహెచ్‌డీ, రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

1. రిసెర్చ్‌ ప్రోగ్రామర్‌ (పీహెచ్‌డీ/ ఎంఎస్‌(ఇంజినీరింగ్‌)/ ఎంఎస్‌ (రిసెర్చ్‌))

2. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) ఇన్ కెమిస్ట్రీ

3. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) ఇన్‌ ఇంటర్‌-డిసిప్లినరీ బయోసైన్స్‌ 

4. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ 

5. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెటిరియల్‌ సైన్స్‌ (పీజీడిఎంఎస్‌)

అర్హత: ప్రోగ్రామ్‌లను అనుసరించి 55 శాతం మార్కులతో సైన్స్‌ విభాగంలో డిగ్రీ, కెమిస్ట్రీ తప్పనిసరి ఒక సబ్జేక్టుగా ఉండాలి. బీఎస్సీ/ఎంఎస్సీ, బీఈ/ బీటెక్‌/ బీఎస్‌ లేదా ఎంఈ/ ఎంటెక్‌

లేదా బీవీఎస్సీ/ ఎంవీఎస్సీ/ ఎంబీబీఎస్‌, ఎండీ ఉత్తీర్ణతతో పాటు 

గేట్‌/ జేఈఎస్‌టీ/జీపీఏటీ/యూజీసీ/-జేఆర్‌ఎఫ్‌/సీఎస్‌ఐఆర్‌-జేఆర్‌ఎఫ్‌/-నెట్‌-జేఆర్‌ఎఫ్‌/ ఐసీఎంఆర్‌-జేఆర్‌ఎఫ్‌/ ఇన్‌స్పైర్‌ స్కోర్‌-జేఆర్ఏఫ్‌, జేఏఎం ఏదైనా ఒక ప్రవేశ పరీక్షలో స్కోర్‌ సాధించి

ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-04-2025.

Website: https://www.jncasr.ac.in/