మహారాష్ట్ర, నాగ్‌పుర్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రిసెర్చ్ డెవెలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్ ( జేఎన్‌ఏఆర్‌డీడీసీ) రెగ్యులర్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
సెక్షన్ ఆఫీసర్- 01
సైంటిఫిక్ అసిస్టెంట్-II - 02
సైంటిఫిక్ అసిస్టెంట్-I - 01
ల్యాబ్ అసిస్టెంట్- 01
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సెక్షన్ ఆఫీసర్‌కు రూ.44,900- రూ.1,42,400; సైంటిఫిక్ అసిస్టెంట్-IIకు రూ.29,200- రూ.92,300; సైంటిఫిక్ అసిస్టెంట్-Iకు రూ.25,500- రూ.58,500; ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.19,900-రూ.63,200.
వయోపరిమితి: సెక్షన్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్-IIకు 30 ఏళ్లు; సైంటిఫిక్ అసిస్టెంట్-Iకు 25 ఏళ్లు; ల్యాబ్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.500.(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17-1-2025
Website:https://jnarddc.gov.in/