దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ కోసం 113 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) 2025, నవంబరు 7న కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.8,870 కోట్లు. దీనికింద ఎఫ్404-జీఈ-ఐఎన్20 శ్రేణి ఇంజిన్లను భారత్‌కు జీఈ అందిస్తుంది. 2027 నుంచి వీటి సరఫరా మొదలై 2032 కల్లా పూర్తవుతుంది.