Published on Dec 22, 2025
Apprenticeship
జీఆర్‌ఎస్‌ఈలో ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
జీఆర్‌ఎస్‌ఈలో ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

భారత ప్రభుత్వ సంస్థ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో (జీఆర్‌ఎస్‌ఈ) ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 220

వివరాలు:

ట్రేడ్‌ అప్రెంటిస్‌: 120

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్: 40

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 60

ట్రేడులు/విభాగాలు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, పైప్‌ ఫిట్టర్‌, కార్పెంటర్‌, డ్రాట్స్‌మెన్‌, పెయింటర్‌, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏయిర్‌ కండీషనింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగం, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్: ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఫ్రెషర్స్‌కు మొదటి ఏడాది రూ.8,200, రెండో ఏడాది రూ.9,020; ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఎక్స్‌-ఐటీఐకు రూ.9,600 లేదా రూ.10,560; గ్రాడ్యుయేట్స్‌కు రూ. 12,500- రూ.15,000; టెక్నీషియన్స్‌కు రూ.10,900.

వయోపరిమితి: నెలకు 01.12.2025 నాటికి ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఎక్స్‌-ఐటీఐ అభ్యర్థులకు 14- 25 ఏళ్లు; ఐటీఐ ఫ్రెషర్స్‌కు 14- 20 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అభ్యర్థులకు 14- 26 ఏళ్ల మధ్య ఉండాలి.

పని ప్రదేశాలు: కోల్‌కతా, రాంచీ.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2026.

Website:https://www.grse.in/career/