గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ (జీఆర్‌ఎస్‌ఈ), కోల్‌కతా వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 56
వివరాలు:
1. సూపర్ వైజర్(ఎస్ గ్రేడ్- 1, 2, 3, 4): 38
2. డిజైన్ అసిస్టెంట్(ఎస్ గ్రేడ్-1, 2): 17
3. ఇంజిన్ టెక్నీషియన్(ఎస్ గ్రేడ్-1): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీబీఏ, బీఎస్సీ, డిప్లొమా, బీబీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డిజైన్ అసిస్టెంట్‌కు 32 ఏళ్లు, సూపర్‌వైజర్‌కు 36 - 38 ఏళ్లు, ఇంజిన్ టెక్నీషియన్‌కు 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు సూపర్‌వైజర్ ఎస్-3గ్రేడ్‌కు రూ.27,600 - రూ.96,600, సూపర్‌వైజర్(ఎస్-2 గ్రేడ్)కు రూ.25,700 - రూ.90,000, సూపర్‌వైజర్(ఎస్-1గ్రేడ్)కు రూ.23,800 - రూ.83,300, సూపర్‌వైజర్(ఎస్-4గ్రేడ్)కు రూ.29,300 - రూ.1,02,600, ఇంజిన్ టెక్నీషియన్‌కు రూ.23,800 - రూ.83,300, డిజైన్ అసిస్టెంట్‌కు రూ.23,800 - రూ.83,300.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 12.