కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో (జీఆర్‌ఎస్‌ఈ) ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 230.
వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ): 90
2. ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్): 40
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40
4. టెక్నీషియన్ అప్రెంటిస్: 60
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌లకు (ఫ్రెషర్) మొదటి ఏడాది - రూ.6,000; రెండో ఏడాది రూ.6,600; ట్రేడ్ అప్రెంటిస్‌లకు(ఐటీఐ) మొదటి ఏడాది రూ.7,000; రెండో ఏడాది రూ.7, 7000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.15,000 (కోల్‌కతా)- రూ.12,500 (రాంచీ); టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.10,000(కోల్‌కతా)- రూ.9,000(రాంచీ).
వయోపరిమితి: 14 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
శిక్షణ ప్రదేశాలు: కోల్‌కతా, రాంచీ.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2024.
Website:https://grse.in/