Published on Nov 27, 2025
Current Affairs
చెస్‌ ప్రపంచకప్‌
చెస్‌ ప్రపంచకప్‌
  • భారత్‌ ఆతిథ్యమిచ్చిన చెస్‌ ప్రపంచకప్‌లో ఉజ్బెకిస్థాన్‌కి చెందిన జవోకిర్‌ సిందరోవ్‌ విజేతగా నిలిచాడు. అతడి వయసు 19 ఏళ్లు. అత్యంత పిన్న వయసులో ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని సొంతం చేసుకున్న ప్లేయర్‌గా సిందరోవ్‌ రికార్డు నెలకొల్పాడు. ఫైనల్లో అతడు 2.5-1.5తో వీ యి (చైనా)ను ఓడించాడు. 
  • నాదిర్బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను 2-0తో ఓడించిన ఆండ్రీ ఎసిపెంకో (ఫిన్లాండ్‌) మూడో స్థానంలో నిలిచాడు.