 
        
      ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం బుకర్.. ఇకపై పిల్లల కాల్పనిక సాహిత్యానికి కూడా అందనుంది. ఈ విషయాన్ని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ 2025, అక్టోబరు 24న వెల్లడించింది. ఈ కేటగిరీని 2026లో నామినేషన్ల కోసం తెరవనున్నారు. 2027లో బహుమతులను ప్రదానం చేస్తారు. విజేతను చిన్నారులు, పెద్దలతో కూడిన ప్యానల్ ఎంపిక చేయనుంది.
చిల్డ్రన్ బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నవారికి 50 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.58,45,215) బహూకరించనున్నారు.