Published on Oct 29, 2025
Current Affairs
‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా 2025’ నివేదిక
‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా 2025’ నివేదిక

పిల్లల సమగ్ర ఎదుగుదలకు అవరోధంగా ఉన్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ తాజాగా ‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా 2025’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇది వెల్లడించింది. దీని ప్రకారం, పోషకాహార లోపంతో పిల్లలకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ తగినంతగా అందట్లేదు. 35.5% పిల్లల్లో పెరుగుదల లోపాలున్నాయి. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో 30.1%, గ్రామీణ ప్రాంతాల్లో 37.3% మందిలో ఉంటోంది. మేఘాలయలో అత్యధికంగా 46.5% పిల్లలు ఈ లోపంతో బాధపడుతున్నారు.