Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 5, 2026
Current Affairs
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్‌కో
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్‌కో
  • ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్థ ఏపీ జెన్‌కో 2025, జనవరి 4న థర్మల్‌ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్‌ ద్వారా 181 మెగావాట్లు.. మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల విద్యుత్‌.. థర్మల్‌ ప్లాంట్ల ద్వారా గ్రిడ్‌కు అందుతోందని అధికారులు తెలిపారు. 
  • ఏపీ జెన్‌కో, ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌)లకు విజయవాడ, కడప, నెల్లూరు జిల్లాల్లో 6,610 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న థర్మల్‌ యూనిట్లు ఉన్నాయి. వాటిద్వారా గతంలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తే కష్టమయ్యేది. ప్రస్తుతం 5,828 మెగావాట్ల ఉత్పత్తి గ్రిడ్‌కు అందుతోంది. ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79 శాతం ఉత్పత్తి వస్తోంది. 
  • ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా జల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం తక్కువ. ఈ పరిస్థితుల్లోనూ మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్లు, నాగార్జునసాగర్‌ కుడికాలువ పంప్‌ హౌస్‌ ద్వారా 40 మెగావాట్లు, హంపి పవర్‌ హౌస్‌ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు అందింది.