Published on Sep 23, 2024
Current Affairs
చిరంజీవి
చిరంజీవి

తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి.. మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రిచర్డ్‌ స్టెన్నింగ్, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ 2024, సెప్టెంబరు 22న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.