దేశీయ క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న చమురు-గ్యాస్‌పై, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికే అధికారం ఉండేలా ముసాయిదా మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. చమురు క్షేత్రాల చట్టానికి చేస్తున్న సవరణ ప్రకారం.. జాతీయ అత్యయిక స్థితిలో దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు-గ్యాస్‌పై ప్రభుత్వమే ముందస్తు హక్కుల (ప్రీ-ఎమ్షన్ రైట్స్)ను కలిగి ఉంటుంది. ఒక ఉత్పత్తి, ఆస్తి లేదా వనరును ఇతరులకు అందించే ముందు, కొనుగోలు చేయడానికి లేదా క్లెయిమ్ చేయడానికి ఒక పార్టీకి అది ప్రభుత్వం గానీ ఇప్పటికే ఉన్న వాటాదారునికి గానీ ఉండే చట్టబద్ధమైన హక్కే ప్రీ-ఎమ్షన్ రైట్స్ లేదా ప్రీఎమ్టివ్ రైట్స్.