దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ‘ఆయిల్ ఫీల్డ్స్(రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) సవరణ బిల్లు-2024’కు పార్లమెంటు ఆమోదం లభించింది.
2025, మార్చి 12న ఈ బిల్లుకు లోక్‌సభ సమ్మతి తెలుపగా, రాజ్యసభ 2024, డిసెంబరు 3న ఆమోదం తెలిపింది.
చమురు క్షేత్రాల అన్వేషణ, చమురు ఉత్పత్తిలో ఇప్పటిమాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సమప్రాధాన్యం కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పష్టం చేశారు.