Published on Oct 15, 2025
Current Affairs
చైనా రక్షణ వ్యవస్థ
చైనా రక్షణ వ్యవస్థ

ప్రపంచంలోని ఏ మూల నుంచి క్షిపణిని ప్రయోగించినా ఇట్టే పసిగట్టేసి సమర్థవంతంగా నిలువరించే గగనతల కవచం ‘డిస్ట్రిబ్యూటెడ్‌ ఎర్లీ వార్నింగ్‌ డిటెక్షన్‌ బిగ్‌ డేటా ఫ్లాట్‌ఫామ్‌’ను చైనా సిద్ధంచేస్తోంది.

ఏకంగా వెయ్యి క్షిపణులు చైనా పైకి దూసుకొచ్చినా వాటిని అడ్డుకోగలదు.

ఇజ్రాయెల్‌కు క్షిపణుల్ని అడ్డుకునే ‘ఐరన్‌ డోమ్‌’ వ్యవస్థ ఉండగా, అంతకంటే శక్తిమంతమైన ‘గోల్డెన్‌డోమ్‌’ను అమెరికా ప్రతిపాదించింది.

ఇప్పుడు చైనా కూడా ఆ ప్రయత్నం చేస్తోంది.