చైనా జనాభాలో వరుసగా మూడో ఏడాదీ తగ్గుదల నమోదైంది. 2024 సంవత్సరం చివరి నాటికి చైనాలో 140.8 కోట్ల జనాభా ఉంది.
2023తో పోలిస్తే 13.9 లక్షల మేర జనాభా తగ్గిపోయింది. ఈ గణాంకాలను చైనా ప్రభుత్వం 2025, జనవరి 17న విడుదల చేసింది.
జనాభా తగ్గిపోతున్న జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తూర్పు ఐరోపా దేశాల జాబితాలో మూడేళ్ల క్రితమే చైనా చేరిపోయింది.
చైనా జనాభాలో 22 శాతం మంది(31.30 కోట్లు) 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.