Published on Nov 8, 2025
Current Affairs
చైనా అమ్ములపొదిలోకి మూడో విమానవాహక నౌక
చైనా అమ్ములపొదిలోకి మూడో విమానవాహక నౌక

ఫుజియాన్‌ పేరుతో తన మూడో విమానవాహక నౌకను చైనా లాంఛనంగా నేవీలో చేర్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ విమానవాహక నౌకను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హైనాన్‌ ప్రావిన్స్‌లోని సాన్య రేవు వద్ద ప్రారంభించారు. ఫుజియాన్‌లో విద్యుదయస్కాంత (ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌- ఈమాల్స్‌) వ్యవస్థను ఏర్పాటు చేశారు. విమాన వాహకనౌక డెక్‌ నుంచి యుద్ధవిమానాలను వేగంగా, సాఫీగా నింగిలోకి పంపడానికి ఇది ఉపయోగపడుతంది. ఇలాంటి వ్యవస్థ.. అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ యూఎస్‌ఎస్‌ జెరల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో మాత్రమే ఉంది.