ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ చైన్ సింగ్‌కు కాంస్యం దక్కింది. 2024, ఏప్రిల్ 4న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగిన పోటీల్లో అతడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో కాంస్యం సాధించాడు.
చైన్ సింగ్ 443.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఇస్త్వాన్ పెని (హంగేరీ-461), టియాన్ జైమింగ్ (చైనా-458.8) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు.