చైనాలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి 2026, మార్చి 19న నియమితులయ్యారు. ప్రదీప్ కుమార్ రావత్ స్థానంలో ఇప్పుడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 1995 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన విక్రమ్ ప్రస్తుతం బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు చైనా భాష మాండరిన్‌పై పట్టుతోపాటు దౌత్యంలో అపారమైన అనుభవం ఉంది.