హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ చెన్నై (హెచ్‌వీఎఫ్) ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 220
వివరాలు:
1. జూనియర్ టెక్నీషియన్ (మెషినిస్ట్) - 122
2. జూనియర్ టెక్నీషియన్ (ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్) -55
3. జూనియర్ టెక్నీషియన్ (రిగర్) - 25
4. జూనియర్ టెక్నీషియన్ (హీట్ ట్రీట్‌మెంట్ ఆపరేటర్) -08
5. జూనియర్ టెక్నీషియన్ (సాండ్ & షాట్ బ్లాస్టర్) -06
6. జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్) - 04
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, పోస్ట్ బ్యాగ్ నెం. 01, హెచ్‌వీఎఫ్ ఎస్టేట్, అవడి, చెన్నై - 600 054.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 14-02-2026.