Published on Jan 3, 2025
Current Affairs
చైనాతో మాల్దీవుల స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక
చైనాతో మాల్దీవుల స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక

మాల్దీవులతో చైనా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. సుంకాల తగ్గింపునకు, మార్కెట్‌ విస్తృతికి అవకాశం కల్పించే చైనా-మాల్దీవ్స్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక (సి.ఎం.ఎఫ్‌.టి.ఏ) ఇరుదేశాలకూ లాభదాయకం కాగలవని భావిస్తున్నారు.

ఈ ఒప్పందం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలూ పరస్పర వాణిజ్య పురోభివృద్ధికి ఆటంకంగా ఉన్న అవరోధాలను నిర్మూలించి కొత్త అవకాశాల సృష్టికి కృషి చేస్తాయి.