ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (8,848 మీటర్ల) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధ మహిళగా చాన్‌జిన్ ఆంగ్మో (29) రికార్డు సాధించారు.
ఈమె హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం చాంగోకు చెందినవారు.
దండు షెర్పా, గురుంగ్ మైలాలతో కలిసి ఆమె ఈ ఘనత సాధించారు.
మూడో తరగతి చదువుతుండగా ఎనిమిదేళ్ల వయసులో ఆంగ్మో కంటిచూపు కోల్పోయారు.
దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ హిస్టరీలో పీజీ చేశారు.
దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్నందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి చాన్‌జిన్ ఆంగ్మో పురస్కారాన్ని అందుకొన్నారు.