చైనా ఓ పెద్ద లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఐఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వేలాడే వంతెనగా నిలిచింది. గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్ నదిపై 2,050 అడుగుల ఎత్తులో ఈ హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను నిర్మించారు. ఇదివరకు లోయ చుట్టూ తిరిగి గంటసేపు పట్టే ప్రయాణాన్ని ఇప్పుడు నిమిషంలో పూర్తి చేయవచ్చని చైనా అధికారులు పేర్కొన్నారు. 2022లో నిర్మాణాన్ని ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు. 280 మిలియన్ డాలర్లు (రూ.2,411 కోట్లు) ఖర్చు పెట్టారు. జూన్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది.