కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి ప్రకటించిన బాలసాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ అందుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో 2024, నవంబరు 14న నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీఛైర్మన్ మాధవ్‌కౌశిక్ ఆయనకు ఈ అవార్డుతోపాటు రూ.50వేల నగదు బహుమతి, తామ్రపత్రం అందించి.. శాలువాతో సత్కరించారు.
చిన్నారుల జీవితాలపై ఆయన రాసిన మాయాలోకం నవలకు అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
చంద్రశేఖర్ ఆజాద్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఇప్పటివరకు 30 నవలలు, వందకు పైగా లఘుకథలు రాశారు. గతంలో నంది అవార్డు, కళారత్నహంస పురస్కారాలు పొందారు.