సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) రాష్ట్ర ప్రధాన కమిషనర్‌గా డా.జి.చంద్రశేఖర్‌రెడ్డి 2025, మే 9న పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగుతారు.