కేరళ డీజీపీగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రావాడ అజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం.
చంద్రశేఖర్ 1991వ బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి.
ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఐబీ) స్పెషల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు కేరళ డీజీపీగా ఉన్న షేక్ దర్వేష్ సాహెబ్ 2025, జూన్ 30న పదవీ విరమణ చేయటంతో.. ఆ స్థానంలో చంద్రశేఖర్‌ను కేరళ ప్రభుత్వం నియమించింది.
ఆయన ఈ పోస్టులో రెండేళ్ల పాటు కొనసాగుతారు.