చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి.నారాయణన్ 2025, మార్చి 16న తెలిపారు.
2023లో ప్రయోగించిన చంద్రయాన్-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్‌ను జాబిల్లిపై దించామని ఆయన పేర్కొన్నారు.
చంద్రయాన్-5లో మాత్రం 250 కిలోల రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు.
జపాన్‌తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్‌ను 2027లో ప్రయోగిస్తామని తెలిపారు.