చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి నీటి అన్వేషణ కోసం స్మార్ట్ రోబోటిక్ ‘ఫ్లయర్ డిటెక్టర్’ను పంపేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోంది.
2026లో చేపట్టనున్న చాంగే-7 మిషన్‌లో ఈ ఫ్లయింగ్ రోబో డిటెక్టర్ భాగం కానుంది. దీంతోపాటు ఓ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి.
ఈ యాత్రలో జాబిల్లిపై ఐస్ రూపంలో ఉన్న నీటిని స్పష్టంగా గుర్తించడమే లక్ష్యం.